schedule Tuesday, July 28, 2026

ప్లాస్టిక్ ఎంత ప్రమాదమో తెలియజేసే చిత్రం..

calendar_today April 30, 2026
person Prajagalam News
ప్లాస్టిక్ ఎంత ప్రమాదమో తెలియజేసే చిత్రం..
అంతర్వేదిలో కనిపించిన ఈ దృశ్యం మన సమాజానికి ఒక గట్టి హెచ్చరిక. ప్రాణం ఉన్నప్పుడు ఆహారం కోసం తిరిగిన ఆ పశువు చివరకు మనం విసిరేసిన ప్లాస్టిక్ వ్యర్థాలకు బలైంది. ఆకలితో బాధపడుతూ ఆహారం అనుకొని ప్లాస్టిక్ సంచులను మింగిన ఈ జంతువు తన ప్రాణాలను కోల్పోయింది.శరీరం కుళ్లిపోయినా, అస్థిపంజరం మాత్రమే మిగిలినా, ప్లాస్టిక్ మాత్రం అలాగే కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.ప్రతిరోజూ మనం నిర్లక్ష్యంగా పారేస్తున్న ప్లాస్టిక్ వల్ల వేలాది జంతువులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గేదెలు, కుక్కలు, పక్షులు ఇలా ఏజీవి అయినా దీనికి బలి కావచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది.ప్లాస్టిక్ మనకు సౌకర్యం ఇచ్చినా, అదే సమయంలో అది ప్రకృతికి శాపంగా మారింది.మనం ఒక్కసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ సంచులు, బాటిల్స్ వాటికి ప్రకృతిలో విచ్ఛిన్నం కావడానికి వందల సంవత్సరాలు పడుతుంది. ప్రకృతిని కాపాడటం అంటే మనల్ని మనం కాపాడుకోవడం అనే విషయం మర్చిపోకూడదు...