schedule Wednesday, July 29, 2026

ప్రభుత్వాలు ఉచితాలు మాని ఉపాధి అవకాశాలు కల్పించాలి.....నాగవర్ధన్ కాంగ్రెస్ నాయకులు

calendar_today May 3, 2026
person Prajagalam News
ప్రభుత్వాలు ఉచితాలు మాని ఉపాధి అవకాశాలు కల్పించాలి.....నాగవర్ధన్ కాంగ్రెస్ నాయకులు
ప్రభుత్వాలు ప్రజలకు ఉచితాలు మానుకుని ఉపాధి అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ నాయకులు నాగవర్ధన్ ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో ఆదివారం డిమాండ్ చేశారు. కులాల పేరుతో పాఠశాలలను విభజించకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే నైపుణ్యంతో కూడిన విద్యనే అందించాలని,విద్యను వ్యాపారం చేయకుండా చూడాలని అన్నారు.అదేవిధంగా యువతను ఉచిత పథకాలతో సోమరిపోతులుగా మార్చకుండా ప్రతి ఏటా ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించి కష్టపడే తత్వాన్ని ప్రోత్సహించి నేరాలను అదుపు చేయాలన్నారు.ప్రజలకు ఉచిత వైద్యం అందించి ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలన్నారు.వ్యవసాయాన్ని ఉపాధి హామీతో అనుసంధానం చేయాలన్నారు.భావి తరాలకు కల్తీ లేని ఆహారం,స్వచ్ఛమైన గాలి అందాలంటే రైతన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రభుత్వాలు ఉచితాల కంటే మౌలిక సదుపాయాలు కల్పించినపుడే దేశం,రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు.