schedule Saturday, August 01, 2026

క్రీడా పాఠశాలకు ఎన్నికైన విద్యార్థిని అక్షర:- చెల్లాపూర్ హెచ్ఎం తుప్పలి.ఆనంద్ కుమార్ 

calendar_today May 8, 2026
person Prajagalam News
క్రీడా పాఠశాలకు ఎన్నికైన విద్యార్థిని అక్షర:- చెల్లాపూర్ హెచ్ఎం తుప్పలి.ఆనంద్ కుమార్ 
  (కుల్కచర్ల)   విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడ ప్రాధాన్యత ఇవ్వాలని చెల్లాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తుప్పలి ఆనంద్ కుమార్ అన్నారు.వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని చెల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న మూడవ తరగది విద్యార్థిని పుట్టపహాడ్ అక్షర క్రీడా పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో ఎన్నిక కావడం జరిగిందని తెలిపారు.ఈ సందర్బంగా అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కోస్గి సంతోష,ఉపాధ్యాయులు శ్రీనివాసులు,దస్తయ్య తదితరులు విద్యార్థిని అక్షరను అభినందించారు.