schedule Saturday, May 30, 2026

మృతి చెందిన బాల్యమిత్రుడి కుటుంబానికి 50వేల ఆర్థిక సహాయం అందజేసిన మిత్రులు

calendar_today May 9, 2026
person Prajagalam News
మృతి చెందిన బాల్యమిత్రుడి కుటుంబానికి 50వేల ఆర్థిక సహాయం అందజేసిన మిత్రులు
(కుల్కచర్ల)
గత నెల రోజుల క్రితం కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన పాలెపల్లి వెంకటయ్య అకాల మరణం పట్ల కుల్కచర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997-98 వ విద్యా  సంవత్సరంలో పదవ తరగతి చదివిన బాల్య మిత్రులు విచారం వ్యక్తం చేస్తూ మిత్రుడి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.శనివారం మిత్రుడి కుటుంబ సభ్యులకు తమవంతుగా ఆయా గ్రామాలకు చెందిన చిన్ననాటి స్నేహితుల సహకారంతో 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో కామునిపల్లి సర్పంచ్ మోర వెంకటేష్,పీరంపల్లి మాజీ సర్పంచ్ సోమలింగం,ఆర్మీ రిటైర్డ్ నర్సింహా రెడ్డి.ఎర్ర. విష్ణువర్ధన్ రెడ్డి,బుచ్చయ్య, నర్సిములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.